పానీ పూరి:

కావలసిన పదార్థాలు:

ఉప్మా రవ్వ - అరకప్పు,

మైదా - అర టేబుల్‌ స్పూన్‌

పుదీనా - 2 కట్టలు,

ధనియాలు - 1 టేబుల్‌ స్పూన్‌

చింతపండు - నిమ్మకాయంత,

అల్లం - 25 గ్రాములు,

నూనె - సరిపడా

ఉప్పు - తగినంత,

పచ్చిమిర్చి - 4,

జీలకర్ర పొడి - 1టీ స్పూన్‌

బ్లాక్‌ సాల్ట్‌ - ఒకటిన్నర టీ స్పూన్‌,

మొలకలు - అరకప్పు,

బూందీ - అరకప్పు


తయారీ విధానం:

బొంబాయిరవ్వలో మైదా, ఉప్పు వేసి చపాతీ పిండిలా కలిపి పావుగంట నాననివ్వాలి.

తర్వాత ఈ పిండిని బాగా చిన్న ఉండలు చేసుకుని పూరీల్లా వత్తి నూనెలో వేయించుకోవాలి. ఇప్పుడు పూరీలు తయారైనట్టే.

వీటిని గాలి చేరని డబ్బాలో వేసుకోవాలి.

చింతపండులో నీళ్లుపోసి గంట నానబెట్టాలి.

ధనియాలను పొడి చేసుకోవాలి.

పుదీనా, పచ్చిమిర్చి, అల్లం నూరుకోవాలి.

చింతపండు రసం తీసి దానికి మరికొన్ని నీళ్లు కలపాలి.

అందులో పుదీనా పచ్చిమిర్చి అల్లం పేస్ట్‌, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, బ్లాక్‌సాల్ట్‌ కలపాలి.

ఈ మిశ్రమాన్ని రెండు, మూడు గంటలు కదపకుండా ఉంచాలి.