దోసకాయ శనగపప్పు కూర:

కావలసినవి:

దోసకాయ - 1 (తొక్కు తీసి ముక్కలు కోసుకోవాలి)

పచ్చి శనగపప్పు - 1 కప్పు (ఓ గంటపాటు నీళ్లలో నానబెట్టుకోవాలి)

ఉల్లిపాయ - 1

పచ్చిమిర్చి - 4

ఉప్పు, పసుపు, కారం, నూనె - తగినంత

కొత్తిమీర - కొద్దిగా

ఆవాలు, జీలకర్ర - చెరో స్పూను

కరివేపాకు - 2 రెమ్మలు


తయారీ విధానం :

బాండీలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి.

తర్వాత ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.

తర్వాత దోసకాయ ముక్కలు, నానబెట్టిన శనగపప్పు, ఉప్పు, పసుపు వేసి కలపాలి.

మూత పెట్టి చిన్న మంట మీద ముక్కలు మెత్తబడే వరకూ కలుపుతూ ఉడికించాలి.

నీరు ఇగిరిపోయాక కారం, కొత్తిమీర వేసి కలపాలి.

తర్వాత ముక్కలు మునిగేవరకూ నీరు పోసి తగినంతగా చిక్కబడేవరకూ చిన్న మంట మీద ఉడికించాలి.