గోరుచిక్కుడు టొమాటో కర్రి:

కావలసిన వస్తువులు:

‌గోరుచిక్కుడు - పావుకిలో

‌‌టొమాటో - 1 (సన్నని ముక్కలుగా కట్‌ చేసుకోవాలి)

‌ఉల్లిపాయ - 1 (తరగాలి)

పచ్చిమిర్చి - 4

జీలకర్ర, ఆవాలు - 1 టీస్పూన్‌

కొత్తిమీర - 1 టీస్పూన్‌

కరివేపాకు - 2.

నువ్వులపొడి - 1 టీస్పూన్‌

‌నూనె - 1 టీస్పూన్‌

ఎండుమిర్చి - 2

ఉప్పు - తగినం

పసుపు - పావు టీస్పూన్‌


తయారు చేసే విధానం:

ముందుగా పచ్చిమిర్చి, కొత్తిమీరని కలిపి గ్రైండ్ చేసుకోని పక్కన పెట్టుకోవాలి. పాత్రలో నూనె వేడయ్యాక, ఆవాలు, జీలకర్ర, ఒకదాని తర్వాత ఒకటి వేసి, ఎండుమిర్చి, కరివేపాకుని జత చేయాలి. ఉల్లిపాయలు, పసుపు వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించి టొమాటో ముక్కల్లి వేసి అయిదు నిమిషాలు వేయించాలి. గోరుచిక్కుడు, ఉప్పు వేసి అయిదు నిమిషాలు ఉంచి అందులో పచ్చిమిచ్చి ముద్దని వేసి కలియబెట్టి రెండు నిమిషాలు వేయించుకోవాలి. నువ్వులపొడి వేసి మూత పెట్టి సన్నని మంటపై పది నిమిషాలు ఉంచాలి. అడుగు మడకుండా మధ్య మధ్యలో కలుపుతూ గోరుచిక్కుడు ఉడుకేంతవరకు ఉంచి మంట తీసేయాలి. వేడివేడిగా అన్నంలోకి టేస్టీగా ఉంటుంది.