గోంగూర పచ్చడి:

తెలుగువారి సాంప్రదాయ వంటలు అంటే టక్కున గుర్తుకు వచ్చేది మాత్రం గోంగూర పచ్చడి. అటువంటి గోంగూర పచ్చడిని తయారు చేయడం ప్రతి తెలుగు ఆడపడుచుకీ వచ్చి తీరాల్సిందే. మరెందుకు ఆలస్యం దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకుని మీరు ప్రయత్నించండి. గోంగూరలో ఐరన్, విటమిన్స్ మరియు శరీరానికి తోడ్పడే యాంటీయాక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయని న్యూట్రీషన్లు చెబుతున్నారు.


కావాల్సిన పదార్థాలు :

గోంగూర : ఒకకిలో

నూనె : రెండు టీ స్పూన్లు

జీలకర్ర : 25 గ్రాములు

ధనియాలు : 100 గ్రాములు

ఎండు మిరపకాయలు : 15

అల్లం ముక్కలు : 25 గ్రాములు

వెల్లుల్లి రేక్కలు : 10

ఆవాలు : ఒక టీ స్పూన్

పచ్చిశనగ పప్పు : ఒక టేబుల్ స్పూన్

ఇంగువ : ఒక టీ స్పూన్

కరివేపాకు : రెండు రెబ్బలు


తయారు చేసే పద్ధతి :

గోంగూర ఆకుల్ని కడిగి నీరులేకుండా వడకట్టేయాలి. మూకుడులో ఒక టీ స్పూన్ నూనె వేడిచేసి జీలకర్ర, (కొద్దిగా ఉంచి) ధనియాలు, ఎండు మిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, గోంగూర ఆకులు వేయించి చల్లారాక రుబ్బుకోవాలి. విడిగా ఒక టీ స్పూన్ నూనె వేడిచేసి ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి.


జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపపప్పు, ఎండు మిరపకాయలు, ఇంగువ, కరివేపాకు వేసి తాలింపుపెట్టి గోంగూర మిశ్రమంలో కలపాలి. అంతే గోంగూర పచ్చడి రెడీ.