సోయా - టొమాటో కర్రీ:

కావలసినవి:

నానబెట్టిన సోయాబీన్స్ - కప్పు

టొమాటో తరుగు - కప్పు

నూనె - 3 టేబుల్ స్పూన్లు

క్యాప్సికమ్ తరుగు - పావు కప్పు

ఉల్లితరుగు - అర కప్పు;

సోంపు - 2 టీ స్పూన్లు

పుదీనా ఆకులు - అర కప్పు

వెల్లుల్లి రేకలు - 3; పచ్చిమిర్చి - 6

జీడిపప్పు పలుకులు - 10;

బాదంపప్పులు - 6

ఏలకులపొడి, పసుపు, కారం, గరంమసాలా- టీ స్పూను చొప్పున;

కొత్తిమీర - కొద్దిగా

నానబెట్టిన మీల్‌మేకర్ - అరకప్పు


తయారి:

ఒక పెద్ద పాత్రలో సోయాబీన్స్, తగినంత ఉప్పు, నీరు పోసి ప్రెజర్‌కుకర్‌లో ఉంచి, పది విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.

బాణలిలో టేబుల్ స్పూను నూనె కాగాక, వెల్లుల్లి రేకలు వేసి వేయించాలి.

పచ్చిమిర్చి తరుగు, జీడిపప్పు, బాదంపప్పు, సోంపు, ఏలకుల పొడి వేసి బంగారురంగు వచ్చేవరకు వేయించాలి.

సగం ఉల్లితరుగు వేసి వేయించాక, సగం టొమాటో తరుగు జత చేసి బాగా కలపాలి.

చల్లారాక పుదీనా ఆకులు జత చేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన ఉంచాలి.

బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి, మిగిలిన ఉల్లితరుగు, టొమాటో తరుగు, క్యాప్సికమ్ తరుగు, మీల్‌మేకర్ వేసి బంగారురంగు వచ్చేవరకు వేయించాలి.

కారం, పసుపు, ధనియాలపొడి, గరంమసాలా వేసి బాగా కలపాలి. ముందుగా చేసి ఉంచు కున్న పేస్ట్ వేసి రెండు నిముషాలు ఉడికించాలి.

కొద్దిగా నీరు జతచేసి ఐదు నిముషాలు ఉడికించిన తరువాత, సోయాబీన్స్‌ని వేసి నాలుగైదు నిముషాలు ఉడికించి, కొత్తిమీరతో గార్నిష్‌చేసి సర్వ్ చేయాలి.