టమాటా పచ్చడి:

కావలసిన పదార్థాలు :

వేరుసెనగ గింజలు - పావుకిలో (వేయించి పెట్టుకోవాలి)

టమోటాలు - 4

పచ్చిమిరపకాయలు - 8

చింతపండు - 60 గ్రా.

బెల్లం - 50 గ్రా.

గరం మసాలా పొడి - ఒక టీస్పూన్

కారం పొడి - ఒక టీస్పూన్

జీలకర్ర పొడి - ఒక టీస్పూన్

కొత్తిమీర - రెండు టేబుల్ స్పూన్లు

ఉప్పు - తగినంత

నూనె - ఒక టేబుల్ స్పూన్


తయారుచేసే పద్ధతి :

ముందుగా చింతపండులో ఒక కప్పు వేడి నీరు పోసి ఐదు నిముషాలు నానబెట్టి పిండి పులుసు తీసుకోవాలి. బెల్లంను పొడి చేసి చింతపండు రసంలో వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.

వేరుసెనగ గింజలు, పచ్చిమిరపకాయలను మెత్తగా రుబ్బుకోవాలి.

టమోటాలను కొంచెం వేడి నీటిలో నానబెట్టి కాయ పై పొరను తీసి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఒక స్పూన్ నూనె వేసి కాగిన తర్వాత టమోటా ముక్కలను వేయాలి. సన్నని సెగలో ఉడికించాలి. ఆ తర్వాత అందులో వేరుసెనగ ముద్దను, చింతపండు రసం, మిగతా గరం మసాలా, జీలకర్ర, కారం, సరిపడినంత ఉప్పు వేసి కలపాలి. సన్నని సెగ మీదనే ఉడికిస్తూ గ్రేవీ చిక్కబడే వరకూ మగ్గనిచ్చి దించాలి. అందులో కొత్తిమీర చల్లి వడ్డించండి. ఇది అన్నంలోకే కాక, చపాతీలోకి కూడా బాగుంటుంది.