టమాటా కుర్మా:

కావలసిన పదార్థాలు :

చిన్న టమాటాలు - 250 గ్రా.

ఉల్లిపాయ - 1

పసుపు - 1/4 టీ.స్పూ.

కరివేపాకు - 2 రెబ్బలు

కొత్తిమీర - కొద్దిగా

కారం పొడి - 1 టీ.స్పూ.

ధనియాల పొడి - 2 టీ.స్పూ.

గరం మసాలా పొడి - 1/4 టీ.స్పూ.

కొబ్బరి పొడి - 3 టీ.స్పూ.

గసగసాల పొడి - 1 టీ.స్పూ.

అల్లం వెల్లుల్లి ముద్ద - 1 టీ.స్పూ.

ఉప్పు - తగినంత

నూనె - 3 టీ.స్పూ.


తయారు చేసే పద్ధతి :

పాన్లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన లేదా నూరిన ఉల్లిపాయ వేసి దోరగా వేయించాలి. ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు, కారంపొడి వేసి రెండు నిమిషాలు వేపి, చిన్న చిన్న టమాటాలు కట్ చేయకుండా అలాగే వేసి కలిపి మూత పెట్టాలి.

ఒక గినె్నలో కొబ్బరిపొడి, ధనియాల పొడి గరం మసాలా పొడి, గసగసాల పొడి, అర కప్పు నీళ్లు లేదా పెరుగు వేసి ఉండలు లేకుండా కలుపుకుని ఉడుకుతున్న కూరలో వేయాలి. సరిపడ ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఉడికించాలి. కూర ఉడికి నూనె తేలుతున్నప్పుడు దింపేయాలి. పొడులు తయారుగా ఉంటే చాలా త్వరగా తయారు చేసుకునే వంటకం ఇది. పులావ్, రోటీ, పరాఠాలకు ఎంతో బావుంటుంది.