టొమాటో - ఎగ్ కర్రీ:

కావలసినవి:

టొమాటోలు - 6;

కోడిగుడ్లు - 3;

ఉల్లిపాయ - 1;

కరివేపాకు - 1 రెమ్మ;

అల్లం వెల్లుల్లి ముద్ద - చిన్న చెంచాడు;

పసుపు - 1/4 టీస్పూన్;

కారంపొడి - 1 టీ స్పూన్;

గరంమసాలా పొడి - 1/4 టీ స్పూన్;

ఉప్పు - తగినంత;

నూనె - 3 టీ స్పూన్లు;


తయారి:

బాణలిలో నూనె వేడిచేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడేవరకు వేయించాలి. ఇందులో పసుపు, కరివేపాకు వేసి కొద్దిగా వేగిన తర్వాత అల్లంవెల్లుల్లి, కారం పొడి వేయాలి. రెండు నిమిషాలు వేయించి, సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, తగినంత ఉప్పు కలిపి మూతపెట్టాలి. టొమాటో ముక్కలు బాగా మగ్గి, మెత్తబడిన తర్వాత, బాగా కలిపి, కోడిగుడ్లు కొట్టి వేయాలి. గుడ్డు సగం ఉడికిన తర్వాత గరిటెతో మెల్లగా కలపాలి. దీనివల్ల గుడ్డు పెద్దపెద్ద ముక్కలుగా అవుతుంది. నీరంతా ఇగిరిపోయిన తర్వాత గరంమసాలా చల్లి దింపేయాలి. ఈ కూర చపాతీలోకి, అన్నంలోకి బాగుంటుంది.