వంకాయ - జీడిపప్పు కూర:

కావలసిన వస్తువులు:

వంకాయలు - పావు కేజీ

జీడిపప్పు - పావు కేజీ

ఉప్పు - తగినంత

పసుపు - చిటికెడు

ఎండిమిర్చి - 4

ఆవాలు - అర టీ స్పూన్

మినప పప్పు - ఒక టీ స్పూన్

జీలకర్ర - పావు టీ స్పూన్

జీలకర్ర - పావు టీ స్పూన్

శనగపప్పు - ఒక టీ స్పూన్

కరివేపాకు - కొద్దిగా

అల్లం - చిన్న ముక్క

పచ్చిమిర్చి - రెండు

నూనె - మూడు టీ స్పూన్లు

కొత్తమీర - కొద్దిగా


తయారు చేసే విధానం:

ఉప్పు వేసిన నీటిలో తరగిన వంకాయ ముక్కలు వేయాలి. పచ్చి జీడిపప్పు (పిక్కలనుండి తీసినపప్పు) పొట్టు వలచి పెట్టాలి. బాణలిలో నూనే మరిగాక ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, మిగిలిన పోపు వేయించి, అల్లం, పచ్చిమిర్చి ముద్ద వేసి వేగాక, జీడిపప్పు, వంకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి సన్న సెగలో మూత పెట్టి మగ్గించాలి. ఆఖరున దించే ముందు కొత్తి మీర వేసి దించాలి.