గుత్తివంకాయ మ్యాంగో కర్రీ:

కావలసిన వస్తువులు:

వంకాయలు - 250 గ్రాములు.

పచ్చి మామిడి - 1.

పచ్చిమిర్చి - 30 గ్రాములు.

అల్లం - చిన్న ముక్క

జీలకర్ర - 1/2 టీ స్పూను.

వెలుల్లి - 10 రేకులు.

పసుపు - 1/2 టీ స్పూను.

కొత్తిమీర - 1 కట్ట.

కరివేపాకు - 2 రెమ్మలు.

ఉల్లిపాయ - 1.

ధనియాలు - 1 టీ స్పూను.

ఉప్పు - తగినంత.

రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత.


తయారు చేసే విధానం:

ముందుగా ఉల్లిపాయ, ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చిల మిశ్రమాన్ని రుబ్బి పేస్ట్ చేసుకోవాలి. కడాయిలో నూనె వేడయ్యాక ఆవాలు, రుబ్బి ఉంచుకున్న పేస్ట్ వేసి సన్నని సెగపై ఉడికించాలి. వంకాయకు నాలుగు వైపులా గాట్లు పెట్టి పేస్ట్‌లో వేసి ఉడకనివ్వాలి. పసుపు, ఉప్పు, వేసి కొద్ది సేపయ్యాక కప్పు నీళ్ళు పోసి ఉడికించి ఆపై తరిగిన మామిడి వేసి కలపాలి. పైనుండి తరిగిన కొత్తిమీర, కరివేపాకు వేసి కలపాలి.