గుత్తి వంకాయకూర:

కావలసిన వస్తువులు:

గుత్తి వంకాయలు - 1/2కిలో

చింతపండు - 100 గ్రా

ధనియాలు - 100 గ్రా

ఎండు మిరపకాయలు - 50 గ్రా

ఉప్పు - తగినంత

పచ్చిపప్పు - 25 గ్రా. నానపెట్టుకోవాలి

ఉల్లిపాయలు - 3 (100గ్రాములు) సన్నగా తరగాలి


తయారు చేసే విధానం:

ధనియాలు, ఎండుమిరపకాయలు వేయించి పొడిచేసుకొని, చింతపండు రసం తీసుకొని (చిక్కగా) దానిలో పైన తయారు చేసిన పొడి, ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిపప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. వంకాయలు తొడిమ ఊడకుండా 4 పక్షాలుగా కోసి దానిలో పైన తయారు చేసిన మసాలాను పెట్టి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు వేసి దానిలో మసాలా కూరిన వంకాయలను వేసి మిగిలిన మసాలా కూడా గిన్నెలో పోసి సన్న సెగమీద ఉడకనివ్వాలిి.