అల్లం కొత్తిమీర వంకాయ కూర:

కావలసిన వస్తువులు:

వంకాయలు - 10

పచ్చిమిర్చి - 30 గ్రా

అల్లం పేస్ట్ - 20 గ్రా

ఉల్లిపాయలు (తరిగి) - తగినన్ని

కొత్తిమీర - 2 కట్టలు

జీరా - 10 గ్రా

రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత


తయారు చేసే విధానం:

ముందుగా పచ్చిమిర్చి, అల్లం, జీరా, కొత్తిమీర మిశ్రమాన్ని రుబ్బి పేస్ట్ తయారుచేసుకోవాలి. వంకాయల్ని మధ్యలోకి చీల్చి కడాయిలో మూడు నిముషాల పాటు నూనెలో వేయించాలి. వంకాయ మధ్యలో రుబ్బి వుంచుకున్న మిశ్రమాన్ని కూర్చాలి. కడాయిలో నూనె వేడిచేసి ఉల్లిపాయలు వేసి వేయించాక వంకాయలు వేసి సన్నని సెగపై ఉడికించాలి. పైన సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోవాలి.