బీరకాయ, గసగసాల కూర:

కావలసిన పదార్ధాలు :

బీరకాయలు : పావుకేజీ

ఉల్లిపాయ : పెద్దది (తరిగి పెట్టుకోవాలి )

పచ్చి మిరపకాయలు : రెండు (ముక్కలుగా చేసుకోవాలి )

పసుపు : చిటికెడు

కారం : సరిపడ

ధనియాల పొడి : కొద్దిగా

మెంతుల పొడి : చిటికెడు

గసగసాలు : రెండు

ఉప్పు : రుచికి సరిపడ

నూనె : తగినంత

ఆవాలు : స్పూను

జీలకర్ర : స్పూను

మినపప్పు : టేబుల్ స్పూను

ఎండుమిరపకాయలు: రెండు లేదా మూడు

వెల్లుల్లి : ఆరు లేక ఏడు రెమ్మలు

కరివేపాకు : కొద్దిగా


తయారీ విధానం :

ముందుగా గసగసాలు కొద్దిగా వేడి చేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. మందపాటి గిన్నె లేదా బాండి తీసుకొని అందులో నూనె వేసి కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగులో వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలు, పచ్చి మిరపకాయలు, కరివేపాకు వేసుకొని మరికొద్ది సేపు వేయించుకోవాలి. ఇప్పుడు బీరకాయ ముక్కలు, ఉప్పు, కారం పొడి వేసి సన్నని సేగన మగ్గించుకోవాలి. ముక్కలు ఉడికిన తర్వాత ధనియాల పొడి, మెంతి పొడి, గసగసాల పొడి వేసి మరికొద్ది సేపు వేయించుకోవాలి. ఇది వేడి వేడి అన్నం లేదా చపాతిలోకి చాలా రుచిగా ఉంటుంది.