బీరకాయ కూర:

కావలసిన వస్తువులు:

బీరకాయలు - 1 కిలో

నూనె - 25 గ్రా

ఎండుమిర్చి - 4

ఉప్పు - తగినంత


తయారు చేసే విధానం:

బీరకాయలమీద చెక్కును తీసేసి కాయని ముక్కలుగా తరిగి ఉప్పురాసి పెట్టాలి. నూనెకాచి పోపుగింజలు వేయించి, ఎండుమిర్చీ తుంపి ముక్కలు వేసి బీరకాయముక్కల్ని పోపులో వెయ్యాలి. మూతపెట్టి మగ్గనిచ్చి దింపుకోవాల.