బెండకాయ భాజీ:

కావలసిన పదార్థాలు :

బెండకాయలు - అరకిలో

ఉల్లిగడ్డలు - 2

వెల్లుల్లిపాయలు - 5 రెబ్బలు

ధనియాలు - పావు టీ స్పూన్

మిరియాలు - 4

పసుపు - అర టీ స్పూన్

టమాటాలు - 10ఱగా.

గరం మసాలా - అర టీ స్పూన్

పుదీనా - అరకట్ట

ఉప్పు, నూనె - తగినంత


తయారు చేసే విధానం :

ఒక ఉల్లిగడ్డను కోసి దాంట్లో వెల్లుల్లిపాయలు, మిరియాలు, ధనియాలు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిగడ్డను, బెండకాయలను చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి ఉల్లిగడ్డ ముక్కలను వేసి వేయించాలి. బంగారు వర్ణం వచ్చేవరకు ఉంచాక ఉల్లిగడ్డలతో చేసిన పేస్ట్‌ను వేసి మరికాసేపు కలపాలి. దీంట్లో బెండకాయలను వేసి సన్నని మంట మీద 20 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఆ తర్వాత టమాటాలు, పసుపు, గరం మసాలా, ఉప్పు వేసి మరికాసేపు ఉంచాలి. అయితే ఇవి కలిపేటప్పుడు బెండకాయలు చిదిమిపోకుండా జాగ్రత్తపడాలి. పదినిమిషాల తర్వాత పుదీనా వేసి దించేస్తే సరిపోతుంది. సూపర్ అనిపించే.. భేండీ భాజీ మీ చవులూరించక మానదు!