చింతకాయ బెండకాయ కూర:

కావాల్సిన పదార్థాలు:

చింతకాయ ముక్కలు - అర కప్పు,

బెండకాయలు - అరకిలో,

పచ్చిమిరపకాయలు - ఆరు,

ఆవాలు, జీలకర్ర - ఒక టీ స్పూను,

కరివేపాకు - ఒక రెబ్బ,

ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు,

పసుపు - ఒక చిటికెడు,

ఉప్పు - తగినంత,

నూనె - సరిపడా.


తయారుచేయు విధానం:

ముందుగా బెండకాయల్ని కడిగి ఆర బెట్టుకోవాలి. చెమ్మ లేకుండా తుడిచి గుడ్రంగా ముక్కలు కోసుకుని పెట్టుకోవాలి. తరువాత లేత చింతకాయల్ని ముక్కలుగా కోసుకుని దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద కళాయి పెట్టి నూనె పోసి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, బెండకాయ ముక్కలు కూడా వేసి ఎర్రగా వేగాక దంచిన చింతకాయ ముద్ద కూడా వేసి కొద్దిసేపు నూనెలోనే మగ్గనివ్వాలి. అంతే బెండకాయ చింతకాయ కూర రెడీ.