మసాలా మరమరాలు.

ఇవి చాలా ఆరోగ్యకరమైన సాయంకాలపు ఫలహారం. అస్తమానం నూనెలో వేగినవి కాకుండా పిల్లలకి ఇలాంటివి తినిపించారంటే బలానికి బలం కూడా వస్తుంది.బరువు తగ్గాలి అనుకునె వారికి మంచి స్నాక్ ఇది!

కావలసినవి:

మరమరాలు 2 కప్పులు

పల్లీలు అర కప్పు

పుట్నాలు అర కప్పు

కరివేపాకు 2 రెమ్మలు

వెల్లుల్లి 3 భాగాలు

ఎండుమిరపకాయలు 4

పసుపు అర చెంచా

ఉప్పు తగినంత

నూనె ఒక చెంచా

తయారీ విధానం

మూకుడులో నూనె వేడి చెయ్యాలి. అందులో ముందు పల్లీలు వేసి అవి రంగు మారెంతవరకు వేయించాలి. తరువాత కరివేపాకు, దంచిన వెల్లుల్లి, పుట్నాలు, పసుపు, ఎండుమిర్చి వెసి రెండు నిమిషాల పాటు వేయించాలి.నచ్చిన వాళ్ళు ఇంగువ కుడా వెసుకొవచ్చు.మంచి వాసన వస్తుంది. పొయ్యి ఆపేసి పెద్ద గిన్నెలొకి వీటిని తీసుకుని మరమరాలు కూడ వేసి అన్ని బాగ కలిసేలా ఉప్పు జల్లి బాగా కలపాలి. గాలి జొరబడని డబ్బా లో పొసుకుంటే వారం పాటు కరకరలాడుతూ కారం కారం గా బావుంటాయి!