మినపప్పు గారెలు.

గారెలు లేని తెలుగు పండగ సంబరాలని ఊహించుకోగలమా. మెత్తగా నోట్లో వేస్కుంటే కరిగిపొయేలాంటి గారెలు ఎలా చేయాలో చూద్దాం.

కావల్సినవి:

మినప్పప్పు- 2కప్పులు

తరిగిన ఉల్లిపాయలు – 1 కప్పు

తరిగిన అల్లం రెండు చెంచాలు

పచ్చిమిరపకాయలు ఐదు (నూరాలి)

నూనె వెయించడానికి సరిపడా

ఉప్పు తగినంత

తరిగిన కరివేపాకు, కొత్తిమీర గుప్పెడు

పద్ధతి :

మినప్పప్పు ఆరు గంటలు నానబెట్టాలి. తరువాత నీరు వంపేసి మిక్సీ లో వేసి మెత్తగా

గ్రైండ్ చేసుకోండి. వీలైనంత వరకు నీరు పొయకుండా గ్రైండ్ చేయండి. మరీ కుదరకపొతె 2 చెంచాలు కలిపి మెత్తగా పిండి పట్టండి. నీరు పోస్తే గారె నూనె యెక్కువ పీల్చుకుంటుంది. పైగా గుండ్రంగా రావు.

ఇప్పుడు పిండిని ఒక గిన్నెలొకి తీసుకుని అందులొకి ఉప్పు, దంచిన అల్లం, నూరిన పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివెపాకు వెస్కొని బాగ కలపండి.

బాణలి లొ నూనె పొసి పొయ్యి వెలిగించండి. ఒక పాల కవర్ తీసుకొని కొంచెం తడి చేసి,చెయ్యి తడిచేసుకుని పిండి కొంచెం కొంచెం తీసుకుని కవర్ మీద గుండ్రంగా చేత్తో వొత్తుకోవాలి. మధ్యలో చిన్న రంధ్రం చెయ్యండి. అలా ఐన గారెని మెల్లగా చెతిలొకి తీస్కుని నూనెలోకి నిదానంగా జారవిడవండి.

రెండు వైపులా బంగారు రంగులోకి వచ్చేవరకు వెయించి తీయండి. ఇలానె అన్ని గారెలు చేస్కోవాలి. అల్లం పచ్చడి తో గాని టమాటో పచ్చడి కాని వడ్డించారంతే అంతే, యెన్ని తింటామో లెక్క ఉండదు.