బ్రెడ్ ఆంలెట్.

పిల్లలు సాయంత్రం ఇంటికి రాగానె యెమి చెయ్యలో తోచట్లెదా? పొద్దున్నె ఆఫీసు కెళ్ళే హడావిడిలో తిఫ్ఫిన్ ఏం చేయాలో తెలీయట్లేదా? చక చకా అయిపొయే ఐటంస్ కోసం వెతుకుతున్నారా? హేల్థీ మరియు త్వరగా అయిపోయె వంటల్లో ముందుంటుంది ఈ బ్రెడ్ ఆంలెట్.

కావలసినవి:

బ్రెడ్ స్లైసు ఒకటి

కోడిగుడ్డు ఒకటి

ఉప్పు కారం తగినంత

నూనె సగం చెంచా

విధానం:

బ్రెడ్ ముందుగా పది సెకన్లు పెనం మీద వేడి చెయ్యండి. అదే పాన్ పై పావు చెంచా నూనె రాయండి. కోడిగుడ్డు పగుల కొట్టి వేయండి. దానిపై ఉప్పు కారం జల్లండి. అది కొద్దిగా కాలాక బ్రెడ్ వేసి అదమండి.దాని పై మరొ పావు చెంచా నూనె వేయండి. మరి కొంచెం కాలాక మరో వైపుకి తిప్పి కాల్చండి. బ్రెడ్ కొద్దిగా గొధుమ రంగులోకి రాగనె పొయ్యి ఆపెయండి.

ఇది తిఫిన్ కి, లంచ్ కి, సాయంత్రం స్నాక్ కి, రాత్రి లైట్ గా తినాలి అనుకునేవారికి మంచి ఆప్షన్.

సూచన:

1. మీరు డైయాబెటిక్ ఐనా, బరువు తగ్గాలి అనుకున్న బ్రౌన్ బ్రెడ్ వాడుకోండి.

2. ఆలివ్ నూనె వేసుకోండి.

3. పిల్లలకోసం ఐతె కాల్చుకోవడానికి వెన్న వాడండి.

4. సమయం ఉంటే కారట్ తురుము, పుదీనా, కొత్తిమీర తో అలకరించుకొవచ్చు.