పచ్చిమిరపకాయల పచ్చడి.

అమ్మో పచ్చిమిర్చి పచ్చడా అనుకోకండి . ఒక సారి రుచి చుస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.

కావలసినవి:

పచ్చి మిర్చి 100గ్రాములు

నానబెట్టిన చింతపండు నిమ్మకాయంత

ఉప్పు తగినంత

నూనె మూడు స్పూన్లు

పల్లీలు గుప్పెడు

మెంతులు 1 పెద్ద చెంచాడు

పోపు సామాన్లు

నీళ్ళు కొద్దిగా (చిలకరించుకోవడానికి)

విధానం:

చింతపండు పావుగంట ముందే నాన బెట్టుకోవాలి. మిర్చి కడిగి నీళ్ళు లేకుండా తుడుచుకోవాలి.తొడిమెలు తీసేయాలి. బానలి లో రెండు చెంచాలు నూనె వేసి వేడి అయ్యాక మెంతులు వేసి చిటపటలాడించాలి. తర్వాత మినపప్పు, పచ్చిసెనగపప్పు, పల్లీలు వెసి వేయించాలి, ఆనక మిర్చివేసి బాగ కలిపి మూత పెట్టాలి, రెండు నిముషాల తర్వాత చింతపండు వేసి ఒకటి లెద రెండు స్ప్పొన్లు నీరు చిలకరించి ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. రెండు నిముషాల తర్వాత పొయ్యి ఆపేసి ఇవి చల్లారాక మిక్సీ పట్టుకోండి. గిన్నె లోకి తీసుకుని పెఒపు వేసుకుంటే పుల్ల పుల్లగా కారం కారం గా చాల బావుంటుంది.దోసె లొకి, వేడి అన్నం లోకి , ఇడ్లీ లోకి, రాగి ముద్ద లోకి చాల బావుంటుంది.