టమాట రోటి పచ్చడి.

ఐదు నిముషాల్లొ అయిపొయె పచ్చడి ఇది. అదిరిపొయే రుచి కూడా!

కావలసినవి:

టమాటాలు ఆరు

పచ్చిమిరపకాయలు నాలుగు

నూనె ఒక స్పూను

ఉప్పు తగినంత

కొత్తిమీర చిన్న కట్ట

కరివేపాకు మూడు రెబ్బలు

పద్ధతి:

బానలిలొ నూనె వెసి టమాటాలను, మిరపకాయలను 3 నిముషాలు మూత పెట్టకుందా వెయించాలి.

టమాట తొక్క వచ్చేస్తుంది. దాన్ని పట్టకారతో తీసేసేయాలి.

రోటిలొ ముందు సగం కొత్తిమీర, రెండు రెమ్మలు కరివేపాకు నూరుకోవాలి. తరువాత టమాటా ముక్కలు, మిరపకాయలు వెసి మెల్లగా నూరుకోవాలి. ఆఖరున ఉప్పు కలిపి నూరి, గిన్నెలోకి తీసుకుని పోపు వెయ్యండి. మిగతా కొత్తిమీర తరిగి పైన అలంకరించండి. కారంగా పుల్లగా నోరూరించే టమాట పచ్చడి 5 నిముషాల్లొ సిద్ధం!