టమాటో పెసరపప్పుకట్టు

తేలికగా జీర్ణం అవుతుంది. పిల్లలకి చాలా బలవర్ధకం. చెయ్యడం తెలిక.

కావలసినవి:

టమాటో ముక్కలు ఒక కప్పు

పెసరపప్పు ఒక కప్పు

ధనియాల పొడి 2 స్పూన్లు

యెండుమిరపకాయల పొడి సగం చెంచా

పసుపు చిటికెడు

ఉప్పు తగినంత

నిమ్మకాయ అర చెక్క

పోపు సామన్లు

నెయ్యి ఒక చెంచా

కరివేపాకు, కొత్తిమీర తగినంత

నీరు 3 గ్లాసులు

విధానం:

పెసరపప్పు బాగా మెత్తగా వుడికించుకోవాలి. పొయ్యి వెలిగించి బానలిలో ఒక చెంచా నెయ్యి వెసి పోపు పెట్టుకోవాలి. అందులో టమాటో ముక్కలు వెసి వేయించాలి. రెండు నిమిషాలు అయ్యాక ధనియాల పొడి, యెండుమిరపకాయల పొడి వెసి కలపాలి. పసుపు, కరివేపాకు కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించండి. తరువాత మెత్తగా మెదిపిన పెసరపప్పు వెసి బాగ కలపండి. ఉప్పు వేయండి.కొద్ది కొద్ది గా నీరు పొస్తూ బాగా కలుపుతూ ఉండండి. మొత్తం నీరు పోసేసాక బాగ కలిపి మూత పెట్టకుందా ఐదు నిముషాలు వుడికించండి. పొయ్యి ఆపేసి నిమ్మరసం పిండండి. కొత్తిమీరతో అలంకరించి వడ్డించండి!

సూచన:

1.ఇదే విధంగా కందిపప్పుతో కుడా చేసుకోవచ్చు. కందిపప్పుకి నిమ్మకాయ బదులు చింతపండు రసం వెసుకుంటే బావుంటుంది.

2. కారం కంటే యెండుమిరపకాయల పొడి వేసి చూడండి, రుచిలొ తేడా గమనిస్తారు.