గోధుమ బిస్కట్లు

పిల్లలకి మంచి బలమైన ఆహారం.

కావలసినవి:

గోధుమ పిండి ఒక కప్పు

నీరు తగినంత

పంచదార పొడి రెండు చెంచాలు

నెయ్యి ఒక కప్పు

విధానం

ముందుగా గోధుమ పిండిని చపాతీ పిండిలాగ కలిపి అరగంట నానివ్వాలి.

తరువాత చపాతీలాగ వొత్తుకుని వాటిని మీకు నచ్చిన ఆకారాలలో కోసుకోవాలి.

బానలిలో నెయ్యి వెసి వేడి చెసి ఈ బిళ్ళలని వేసి వేయించుకోవాలి.

వేగాక గిన్నెలొకి తీసుకుని పంచదార పొడి జల్లుకుంటే సరిపోతుంది!

మూడు రోజులు నిలువ వుంటాయి.