పెప్పర్‌ చికెన్‌ స్నాక్స్‌:

కావలసిన పదార్థాలు :

బోన్‌లెస్‌ చికెన్‌ - 200గ్రా

అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ - 5 గ్రా

గుడ్డు - 1

మిరియాల పొడి - 5 గ్రా

ఉప్పు - సరిపడినంత

పండుమిర్చి పేస్ట్‌ - 5 గ్రా

నిమ్మరసం - ఒక టీస్పూను

టేస్టింగ్‌ సాల్ట్‌ - చిటికెడు

కార్న్‌ఫ్లోర్‌ - 5గ్రా

ఆలు (పచ్చివి) స్లైసులు - సరిపడినన్ని

నూనె - సరిపడినంత


తయారు చేసేవిధానం :

చిన్న గిన్నెలో ఆలు, నూనె మినహా అన్నిటినీ వేసి చక్కగా కలిపి మిశ్రమాన్ని తయారు చేసు కోవాలి. చికెన్‌ ముక్కలను అందులో ఇరవై నిమిషాల పాటు నాన బెట్టాలి. చికెన్‌ ముక్కలకు రెండు వైపులా ఆలు స్లైసులు అద్ది టూత్‌ ప్రిక్స్‌తో గుర్చి ఆపై నూనెలో దోరగా వేయించాలి. వేడి వేడిగా ఉన్నప్పుడే పెప్పర్‌ చికెన్‌ స్నాక్స్‌ రుచిని ఆస్వాదించాలి.