పెప్పర్ చికెన్ రోస్ట్:

కావలసిన పదార్థాలు :

చికెన్ - అరకేజి,

మిరియాల పొడి - రెండు టేబుల్ స్పూన్లు,

కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్,

పసుపు - ఒక టీస్పూన్,

ఉప్పు, నూనె - తగినంత.


తయారుచేసే పద్ధతి :

చికెన్ ముక్కల్ని ఉప్పు నీళ్లలో ఉడికించాలి. కళాయిలో నూనె వేడిచేసి అల్లంవెల్లుల్లి పేస్ట్, పసుపు, చికెన్ ముక్కలు వేసి ఐదు నిమిషాలసేపు వేగించి ఉప్పు, కారం, మిరియాలపొడి వేసి మరో ఐదు నిమిషాల వేగించాలి. వేడివేడిగా తింటే భలే టేస్టీగా ఉంటుంది.