టేస్టీ చికెన్‌ కర్రీ:

కావలసిన పదార్ధాలు:

చికెన్‌ 1 కేజి

అరచెక్క కొబ్బరి తురుము

కారం - 3 చెంచాలు

ధనియాల పొడి - 2 చెంచాలు

పసుపు చిటికెడు

జీలకర్ర - చిన్న టీ స్పూన్‌

దాల్చినచెక్క - 10 గ్రా

ఉప్పు తగినంత

కొత్తిమీర - 1 కట్ట

లవంగాలు - 5 గ్రా

నిమ్మకాయ - 1

అల్లం - 10గ్రా

ఉల్లిపాయలు - 4

రిఫైండ్‌ ఆయిల్‌ - 3 టేబుల్‌ స్పూన్లు

నీరు 200 ఎం.ఎల్‌


తయారు చేసే విధానం:

మాంసం ముక్కలు శుభ్రంగా కడిగి కట్‌చేసి ఉప్పు, పసుపు వేసి నానబెట్టాలి. ధనియాలపొడి, పసుపు, జీలకర్ర, లవంగాలు, దాల్చినచెక్క, అల్లం మెత్తగా పేస్టుగా రుబ్బుకోవాలి. కొబ్బరి తురుము కూడా మెత్తగా రుబ్బుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేయించి, నానబెట్టిన చికెన్‌ వేసి బాగా కలి యబెట్టాలి. రుబ్బిన మసాలా వేసి కలిపి ఐదు నిమిషాలు వేయిం చాలి. కొబ్బరిపేస్టు, ఉప్పు, నీరు కలపాలి. మాంసం మెత్తబడే దాకా ఉడికించి. నిమ్మరసం, కొత్తిమీర కలపాలి.