చికెన్‌ లివర్‌ ఫ్రై:

కావలసిన పదార్ధాలు:

లివర్‌ - పావుకేజి

ఉప్పు- తగినంత

నూనె- 1 టేబుల్‌ స్పూన్‌

కారం- 3 చెంచాలు

అల్లంవెల్లుల్లి పేస్టు- 3 చెంచాలు

పసుపు - చిటికెడు

కొత్తిమీర - 1 కట్ట


తయారు చేసే విధానం:

లివర్‌ను శుభ్రంగా కడుక్కుని ఒక గిన్నెలో వేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి.

మగ్గుతుండగా నీళ్ళు వస్తాయి అవన్నీ ఆవిరి అయిపోయాక అల్లంవెల్లుల్లి పేస్టు, నూనె వేసి బాగా ఎర్రగా వేయించి, దించుకునే ముందు కొత్తిమీర వేసుకొని దించుకోవాలి.