చికెన్‌ లివర్‌ టిక్కా:

కావలసిన పదార్ధాలు:

లివర్‌ - పావుకేజి

ఉప్పు- తగినంత

నూనె- 1 టేబుల్‌ స్పూన్‌

అల్లంవెల్లుల్లి పేస్టు - 3 చెంచాలు

పసుపు - చిటికెడు

కారం- 3 చెంచాలు

ధనియాలపొడి- 2 చెంచాలు

ఉల్లిపాయలు - 2

పచ్చిమిర్చి - 3

కొత్తిమీర - 1కట్ట

గరంమసాలా- 2 టీస్పూన్లు (దాల్చిన చెక్క, యాలుకులు, లవంగాలు ముందుగా పొడి చేసుకొని పెట్టుకోవాలి.)


తయారు చేసే విధానం:

లివర్‌ను శుభ్రపరుచుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసు పు, కారం, ధనియాలపొడి ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసి నీళ్ళు అన్నీ ఇంకి పోయే వరకు బాగా ఉడకనివ్వాలి. ఒక బాండీలో నూనె పోసి బాగా మరిగిన త ర్వాత ఈ ఉడికిన లివర్‌ను అందులో వేసి ఎర్ర గా వేగిన తర్వాత, గరంమసాలా వేసి ఐదు నిముషాలు ఉడికించి దించుకునే ముందు కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. వేడి వేడి లివర్‌ టిక్కా రెడీ.