చికెన్ డ్రమ్ స్టిక్స్:

కావలసిన పదార్థాలు :

చికెన్ లెగ్స్ - ఆరు,

అల్లంవెల్లుల్లి పేస్ట్ - రెండు టీస్పూన్లు,

బియ్యప్పిండి, పెరుగు - ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్లు,

మిరియాలపొడి, ధనియాల పొడి - ఒక్కో టీస్పూన్,

ఉప్పు - తగినంత,

కారం, శెనగపిండి - ఒక్కో టేబుల్ స్పూన్,

నూనె -పావుకిలో,

గరం మసాల - ఒక టీస్పూన్,

పసుపు - కొద్దిగా.


తయారుచేసే పద్ధతి :

ఒక గిన్నెలో అల్లంవెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, మిరియాలపొడి, పెరుగు, శెనగపిండి, బియ్యప్పిండి, గరం మసాలా, ధనియాల పొడి వేసి అన్నింటినీ కలిపి మిశ్రమం తయారుచేయాలి. చికెన్ లెగ్ ముక్కలకి చాకుతో గాట్లు పెట్టి ఈ మిశ్రమాన్ని పట్టించి గంట సేపు పక్కన పెట్టాలి. ఆ తరువాత కళాయిలో నూనె వేడిచేసి మసాల పట్టించిన చికెన్ లెగ్ ముక్కల్ని బాగా వేగించాలి. నిమ్మకాయ, ఉల్లిపాయ ముక్కలు, వేగించిన జీడిపప్పు, పల్లీపప్పుల్ని పైన అలంకరిస్తే చికెన్ డ్రమ్స్టిక్స్ రెడీ.