త్రివేండ్రం చికెన్ వేపుడు:

కావలసిన పదార్ధాలు :

చికెన్ : 20 ముక్కలు

అల్లం వెల్లుల్లి పేస్ట్ : 2 టేబుల్ స్పూన్లు

పసుపు : ఒక టీస్పూన్

కాశ్మీరీ కారం : మూడు టీస్పూన్లు

ధనియాల పొడి : ఒక టీస్పూను

చింతపండు నీళ్ళు : రెండు టీస్పూన్లు

పెరుగు : ఒక టీస్పూను

గుడ్డు : 1

కొబ్బరి నూనె : 3 టేబుల్ స్పూన్లు (ఇష్టం లేని వాళ్ళు నచ్చినది వాడుకోవచ్చు)

ఉప్పు : తగినంత


తయారీ విధానం :

నూనె మినహా మిగిలిన పదార్ధాలన్నీ కలపి కనీసం అర గంట సేపు నానపెట్టాలి. బాండి లో నూనె వేసి బాగా కాగిన తర్వాత చికెన్ ముక్కలు వేసి మెత్తబడే దాక ఉంచాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కలుపుకోవాలి. అంతే, త్రివేండ్రం చికెన్ ఫ్రై రెడీ.