ముచ్చటైన ముగ్గులు మన హైందవ సంస్కృతికి భాగమైనవి. ప్రతి ఇల్లాలు వేకువ జామునే లేచి ఇల్లు అలికి ముగ్గులువేయటం మన సాంప్రదాయం. కళ్ళాపి జల్లిన వాకిళ్ళలో తెల్లని ముగ్గు పిండితో గానీ , బియ్యం పిండితో, అత్యంత రమణీయంగా ముగ్గులు పెట్టిన ఇల్లు కు సాక్షాత్తు ఆ లక్మి దేవి వేంచేస్తుంది అని మన వారి నమ్మకం. సంక్రాంతిని ప్రత్యేకించి ముగ్గుల పండుగగా భావిస్తారు. ధనుర్మాసం ప్రారంభం అయితే వీధి వీధుల్లో , సందు సందుల్లో ముత్యాల్లాంటి ముగ్గులతో మెరుస్తాయి. ప్రతి వాకిలిలోను అత్యంత అందమైన ముగ్గులు మెరుస్తాయి.