ప్రార్థన
ప్రార్థన
వందేమాతరం
వందేమాతరం వందేమాతరం
సుజలాం సుఫలాం మలయజ శీతలామ్
సస్యశ్యామలాం మాతరం వందేమాతరం
శుభ్రజ్యోత్స్న పులకిత యామినీమ్
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్
సుహాసినీం సుమధుర భాషిణీమ్
సుఖదాం వరదాం మాతరం వందేమాతరం
కోటి కోటి కంఠ కలకల నివాద కరాలే
కోటి కోటి భుజై ధృత ఖర కరవాలే
అబలాకేనో మాం ఎతో బలే
బహుబల ధారిణీం నమామి తారిణీం
రిపుదల వారిణీం మాతరం వందేమాతరం
తుమి విద్యా తుమి ధర్మ
తుమి హృది తుమి మర్మ
త్వంహి ప్రాణః శరీరే
బహుతే తుమి మా శక్తి
హృదయే తుమి మా భక్తి
తో మారయి ప్రతిమాగడి మందిరే మందిరే వందేమాతరం
త్వంహి దుర్గా దశ ప్రహరణధారిణీ
కమలా కమలదళ విహారిణీ
వాణి విద్యాదాయినీ, నమామిత్వాం, నమామి కమలాం
అమలాం, అతులాం, సుజలాం, సుఫలాం,మాతరం వందేమాతరం
శ్యామలాం, సరలాం, సుస్మితాం, భూషితాం
ధరణీం, భరణీం, మాతరం వందేమాతరం
వందేమాతరం
-బంకించంద్ర ఛటర్జీ
మా తెనుగు తల్లి
మా తెనుగు తల్లికి మల్లె పూదండా
మా కన్న తల్లికి మంగళారతులూ ॥మా తెనుగు॥
కడుపులో బంగారు కను చూపులో కరుణా
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి ॥మా తెనుగు॥
గల గలా గోదారి కదలి పోతుంటేను ॥గల గలా॥
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలు తాయి ॥మా తెనుగు॥
అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక
రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయని కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక
నీ ఆటలే ఆడుతాం - నీ పాటలే పాడుతాం
జై తెనుగు తల్లీ! జై తెనుగు తల్లీ!!
- శంకరంబాడి సుందరాచారి.
జాతీయగీతం
జనగణమన
జనగణమన-అధినాయక జయ హే భారతభాగ్యవిధాతా!
పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ బంగ
వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్ఛలజలధితరంగ
తవ శుభ నామే జాగే, తవ శుభ ఆశిష మాగే,
గాహే తవ జయగాథా।
జనగణమంగళదాయక జయ హే భారతభాగ్యవిధాతా!
జయ హే, జయ హే, జయ హే, జయ జయ జయ జయ హే।।
భారత్ మాతా కీ జై
-రవీంద్రనాథ్ టాగోర్
తెలుగు అనువాదం పంజాబు, సింధు, గుజరాత్, మహారాష్ట్ర లతో కూడిన పశ్చిమ తీర ప్రాంతము. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, తుళు భాషలతో కూడిన ద్రావిడ ప్రాంతము. ఒరిస్సా మొదలైన రాష్ట్రాలతో కూడిన తూర్పు తీర ఉత్కల ప్రాంతము. ఈశాన్య రాష్ట్రాలతో కూడిన బెంగాల్ ప్రాంతము. వింధ్య హిమాలయ పర్వతాలు, యమున గంగలు పై కంటే ఎగసే సముద్ర తరంగాలు. ఇవన్నీ.. తమరి శుభ నామమే తలుచుకుంటూ ఉన్నాయి. తమరి శుభ ఆశిస్సుల నే కోరుకుంటున్నాయి. తమరి విజయగాధనే పాడుకుంటున్నాయి. ఓ జనసమూహాల మనసుల అధినాయక. మీకు జయము! ఓ భారత భాగ్య విధాత, మీకు జయము! నిత్య జయము!
విఘ్నేశ్వర ప్రార్థన:-
శ్లోకం॥ శుక్లాంబరధరం విష్ణుం
శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయే
త్సర్వవిఘ్నోపశాంతయే
శ్లోకం॥ అగజానన పద్మార్కం
గజానన మహర్నిశం,
అనేకదం తం భక్తానాం
ఏకదంత ముపాస్మహే.
గురు ప్రార్థన:-
గురు ర్బహ్మా గురు ర్విష్ణుః
గురు ర్దేవో మహేశ్వరః
గురు స్సాక్షాత్పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవేనమః
సరస్వతి ప్రార్థన:-
సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిద్బవతుమే సదా.
పద్మపత్ర విశాలాక్షీ పద్మ కేసరవర్ణినీ
నిత్యం పద్మాలయా దేవీ సా మాం పాతు సరస్వతీ.
పరమేశ్వరునీ ప్రార్థన:-
ఎవ్వనిచే జనించు జగ మెవ్వని లోపల నుండు లీనమై
ఎవ్వని యందు డిందు పరమేశ్వరు డెవ్వడు మూలకారణం
బెవ్వడనాది మధ్యలయు డెవ్వడు సర్వము దానయైనవా
డెవ్వడు వాని నాత్మ భవు నీశ్వరునే శరణంబు వేడెదన్.
శ్రీనివాస ప్రార్థన:-
శ్రీ వేంకటాచలధీశం శ్రియాధ్యాసిత వక్షసం
శ్రితచేతన మందారం శ్రీనివాస మహం భజే.
కరద్వయేన కమలే ధారయంతీం స్వలీలయా
హారనూపుర సంయుక్తాం లక్ష్మీం దేవీం నమామ్యహమ్.