ఇంట్లో సాగు.
ఇంట్లో చెట్లు పెంచాలని చాలా మంది అనుకుంటారు. కానీ, ఎలానో సరిగ్గా తెలియదు.. మీకు కాస్తా ఓపిక ఉంటే.. ఇలా మీరూ ప్రయత్నం చేయొచ్చు. అదెలాగో మీరు తెలుసుకోండి.
ఇంట్లో సాగు.
ఇంట్లో చెట్లు పెంచాలని చాలా మంది అనుకుంటారు. కానీ, ఎలానో సరిగ్గా తెలియదు.. మీకు కాస్తా ఓపిక ఉంటే.. ఇలా మీరూ ప్రయత్నం చేయొచ్చు. అదెలాగో మీరు తెలుసుకోండి.
సులభంగా ఇలా పెంచండి.
అల్లం:
మీ దగ్గర అల్లం ఉందా? ఒక అల్లం ముక్కని తీసుకొని దాన్ని చిన్నదిగా విరిచి మట్టిలో పెట్టండి . దీనికి క్రమం తప్పకుండా నీరు పోస్తూ ఉండండి. తగినంత సూర్యరశ్మి తగిలేలా కిటికీ దగ్గర ఉంచండి. ఇలా చేస్తే మీరు ఒక వారం తర్వాత కొత్త మొలకలు వస్తాయి. ఇలా పెరిగిన అల్లంని మీరు వాడుకోవచ్చు.
వెల్లుల్లి:
వెల్లుల్లి పెంచడం చాలా సులభం. దీని కోసం కొన్ని వెల్లుల్లి రెబ్బలు అవసరం. కొన్ని వెల్లుల్లి రెబ్బలను మట్టిలో నాటాలి. వెల్లుల్లికి ప్రత్యక్ష సూర్యకాంతి పుష్కలంగా అవసరం, కాబట్టి దాన్ని రోజంతా ఎండలో ఉంచండి. కొత్త వెల్లుల్లి రెబ్బలను నుంచి మొలకలు వచ్చిన తర్వాత, వాటిని కత్తిరించండి. ఈ మొక్కల్లో నుంచి వెల్లుల్లి వస్తుంది. ఈ ఆకులను సూప్‌కి సూపర్బ్ టేస్ట్‌ని ఇస్తుంది.
కొత్తిమీర:
కొత్తిమీర వేర్లను నీటితో బాగా శుభ్రం చేసి ఆకులను కత్తిరించండి. అయితే, కాండం ఒక అంగుళం పొడుగు ఉండేలా చూసుకోండి. ఆ కాండాన్ని ఒక ఒక గ్లాసు నీటిలో వేసి కిటికీ దగ్గర ఉంచండి. వేర్లు రెండు అంగుళాల పొడవు పెరిగినప్పుడు, మీరు దానిని ఒక కుండిలోకి మార్చండి. తరువాత చక్కగా వచ్చిన చిగుర్లని గమనించొచ్చు.
ముల్లంగి:
కుంట్లలో ముల్లంగిని పెంచుకోవడం చాలా సులభం. కుంట్లో విత్తనాలను చల్లాలి. కుంట్లో ఉన్న ఎరువు సారవంతమైనదిగా ఉండేలా చూసుకోవాలి. తర్వాత ఒక నెలలో ముల్లంగి దుంపలు పండటం మీరు గమనించవచ్చు.
పెప్పర్స్:
పెద్ద కుంట్లో పెరిగేటటువంటి బెస్ట్ వెజిటేబుల్. ఈ పెప్పర్స్ పండించుకోవడానికి పెద్ద కుంపట్లు చాలా ఉత్తమం. 5 గ్యాలన్ కుండ లో రెండు మూడు మొక్కలను నాటుకోవచ్చు
ఉల్లికాడలు:
ఉల్లికాడలు (గ్రీన్ ఆనియన్స్) 5 గ్యాలన్ కుండ లో చాలా బాగా పెరుగుతాయి. కుంట్లకు 2, 3అంగులపైవరకూ ఎరువు మట్టితో నింపాలి. తర్వాత ఉల్లిపాయ విత్తనాలు లేదా ఉల్లిపాయలను రెండు మూడు అంగుళాల లోతులోపనికి పూడ్చాలి.
లెట్యూస్:
ఈ గ్రీన్ వెజిటేబుల్ కంటైనర్స్ లో చాలా సులభంగా పెరుగుతుంది. లెట్యూస్ యొక్క విత్తనాలను కుంపట్లో ఎరువుపైన చల్లాలి. తర్వాత అవసరం అయినప్పుడు నీరు పట్టడం వల్ల లెట్యూస్ చాలా త్వరగా మరియు సులభంగా పెరుగుతుంది
టమోటోలు:
కుంట్లలో చాలా సులభంగా పెరిగే వెజిటేబుల్ మొక్క. వివిధ రకాల టమోటో విత్తనాలను తీసుకొచ్చి కుంట్లలో చల్లడం వల్ల టమోటో మొక్కలు చాలా సులభంగా పెరుగుతాయి. మరియు అవసరం అయినప్పుడు నీరు పడుతుండాలి.
బీట్ రూట్:
కుంట్లలో ఏవెరైటీ దుంపలైన చాలా సులభంగా పెరుగుతాయి. ముఖ్యంగా ఎర్రదుంపలు చాలా త్వరగా పెరుగుతాయి. అయితే ఈ దుంపలను నాటే ముందు 12అంగుళాలలోతుగా నాటిలి. మరింత లోతుగా నాటడం వల్ల దుంపలు చెడిపోవడం జరగుతుంది.
పూల మొక్కలు.
కాలెంన్డ్యులా.
కాలెంన్డ్యులా, సాధారణంగా దీనిని "పాట్ మారీ గోల్డ్" అని వ్యవహరించడం జరుగుతుంది. . కుండలు మరియు ప్లాంటర్స్ లో బాగా పెరుగుతాయి. ఇవి అత్యంత సాధారణమైన శీతాకాలపు పువ్వులుగా ఉంటాయి. వీటిని జాగ్రత్తగా నిర్వహించడం కూడా సులభం. పసుపు నుండి లోతైన నారింజ వరకు వివిధ రంగులలో ఈ పూలు పూస్తుంటాయి.
వింటర్ జాస్మిన్.
ఈ శీతాకాలంలో మీ తోటకి అందాన్నివ్వడానికి "వింటర్ జాస్మిన్" రకం మొక్క ఒక అద్భుతమైన ఎంపికగా చెప్పబడుతుంది. వీటి నిర్వహణా వ్యయం, మరియు శ్రమ కూడా తక్కువగా ఉంటుంది. ఇది ప్రకాశవంతమైన పసుపు రంగు పువ్వులను ఉత్పత్తి చేస్తుంది. మరియు అవి జనవరి ప్రారంభంలోనే వికసిస్తుంటాయి.
పాన్సీ.
మరో సాధారణ శీతాకాలపు పువ్వుగా పాన్సీ ఉంటుంది. ఇది దాదాపు అన్ని రంగుల షేడ్స్ లో లభిస్తుంది. విభిన్న రంగుల కలయికను ఉపయోగించి మీరు మీ తోటలో వాటిని పెంచుకోవచ్చు. పాన్సీలు తక్కువగా పెరిగే మొక్కలు కావున ఇవి నీడలో బాగా వృద్ధి చెందుతాయి.
పెటునియా.
మీ శీతాకాలపు తోటను ప్రకాశవంతం చేయడానికి పెటునియాస్ కూడా మంచి ఎంపికగా సూచించబడుతుంది. ఈ శీతాకాలంలో 'గ్రాండి ఫ్లోరా' రకం పెటునియాని ఎంపిక చేసుకోవడం ఉత్తమం. అవి పెద్ద పరిమాణంలో పువ్వులను కలిగి ఉంటాయి. శరదృతువు మరియు శీతాకాలంలో నాటడానికి అనువైన మొక్కలుగా సూచించబడుతాయి. పెటునియాస్ తెలుపు, పసుపు, గులాబీ, ముదురు క్రిమ్సన్ మరియు నలుపు, ఊదా వంటి అనేక షేడ్స్‌లో వస్తాయి.
ఇంగ్లీష్ ప్రింరోస్.
ఈ పువ్వులు, శీతాకాలంలో మీ తోటను అందంగా ఉంచేందుకు సూచించదగిన మరొక ఉత్తమ ఎంపికగా ఉంటుంది. అవి తెలుపు, పసుపు, నారింజ నుండి నీలం, గులాబీ మరియు ఊదా రంగు వరకు దాదాపు అన్నిరకాల రంగులో పూస్తుంటాయి. ఇంగ్లీష్ ప్రింరోస్ శీతాకాలం మధ్యకాలం నుండి వికసిస్తుంది. ప్రొఫెసర్ సింపుల్ ఆర్థిక భావం ద్వారా సుపాండినెలా నడిపారో తెలుసుకోండి. ప్రియమైన వారితో గడిపే క్షణాల్లో మరింతా ఎక్కువ గ్రాండ్ గా అవ్వండి.
హెలెబోర్.
ఈ మొక్కకు ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉంటుంది. దీనిలో వేర్లు లోతుగా పెరుగుతూ రూట్ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. హెలెబోర్స్ చల్లని ఉష్ణోగ్రతను తట్టుకోగలవు. సాధారణంగా ఇవి తెలుపు, గులాబీ మరియు ఊదా వంటి రంగులలో కనిపిస్తాయి. ఈ పువ్వులు పెరుగుతున్నప్పుడు క్రిందికి వ్రేలాడుతూ ఉంటాయి, అందుకే వాటిని ఎత్తుగా ఉన్న కుండీలలో పెంచవలసి ఉంటుంది.
కామెల్లియాస్.
శీతాకాలంలో కామెల్లియాస్ ఆశ్చర్యకరంగా అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకోగల పుష్ప జాతిగా ఉంటుంది. అవి చల్లని గాలులు వీచినంత కాలం ఈ పుష్పాలు వికసిస్తుంటాయి. ఈ మొక్కలు మీ తోటలోని ఇతర మొక్కలతో సరిపోయేలా కూడా ఉంటాయి.
వింటర్ హనీసకిల్.
వింటర్ హనీసకిల్ పువ్వులు నవంబర్ నుండి ఏప్రిల్ వరకు వికసిస్తాయి. ఈ మొక్క క్రీమీ వైట్ పువ్వులను ఉత్పత్తి చేస్తుంది. ఇది నిమ్మకాయను పోలి ఉండే సువాసనను విడుదల చేస్తుంది, ఇది మీ నిస్తేజమైన శీతాకాలపు వాతావరణాన్ని ఆసక్తికరంగా చేస్తుంది.
ఫ్లోక్స్.
శీతాకాలంలో పెరిగే మరొక పుష్ప జాతి మొక్క ఫ్లోక్స్. విస్తృత శ్రేణి రంగులతో, ఇది మీ తోటకి అద్భుతమైన ప్రదర్శనను అందిస్తుంది. స్వీట్ అలిసమ్.. ఈ పువ్వులు తేలికపాటి మంచును తట్టుకోగలవు. అవి దృడంగా ఉన్నందున, వాటిని శీతాకాలం అంతా ఎటువంటి సంకోచం లేకుండా పెంచవచ్చు. ఇవి చూసేందుకు చిన్నవిగా ఉన్నా కూడా, సూక్ష్మమైన తీపి సువాసనను కలిగి ఉంటాయి.
స్వీట్-పీ(బఠానీ).
స్వీట్ బఠానీ మొక్కలకు నిర్వహణ కూడా తక్కువగానే ఉంటుంది. చల్లని శీతాకాలంలో అవి సులభంగా పెరుగుతాయి.ఈ స్వీట్-పీ మొక్క నీలం, గులాబీ, తెలుపు నుండి పీచు, బర్గుండి మరియు మెజెంటా రంగులలో విస్తృతంగా పువ్వులను ఉత్పత్తి చేస్తుంది.
స్నోడ్రోప్స్.
అందమైన, క్రిందికి తిరిగిన తెల్లటి రేకులతో విరబూసే ఈ స్నోడ్రోప్స్ మీ శీతాకాలపు తోటకు సూచించదగిన సరైన పుష్ప జాతి మొక్కలుగా ఉంటాయి. ఈ పువ్వులు నవంబర్ ప్రారంభంలో వికసిస్తూ, అవి ఫిబ్రవరి వరకు పెరుగుతాయి.
శీతాకాలంలో పువ్వులను పెంచడానికి సూచించదగిన చిట్కాలు.
1. మీ తోటలోని స్థలం ప్రకారమే మొక్కలను నాటండి.
2. శీతాకాలంలో మీ మొక్కలకు జాగ్రత్తగా నీరు పోయాలని గుర్తుంచుకోండి.
3. క్రమం తప్పకుండా కంపోస్ట్ అనుసరించండి.
4. కంటైనర్లలో మొక్కలను పెంచుతున్నట్లయితే, కంటైనర్‌లో తగినంత పారుదల ఉండాలని గుర్తుంచుకోండి.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, మాతృత్వ, శిశు సంక్షేమ, జీవన శైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్ స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.