తొక్కుడుబిళ్ళ (Hopscotch) ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో పిల్లలు ఆడే ఆట. ఈ ఆటను మెసిడోనియాకు చెందిన అలెగ్జాండర్ ది గ్రేట్ కనుగొన్నాడని ప్రతీతి. ఈ ఆటను ఒంటరిగా లేదా జట్టుగా ఆడవచ్చు. సాధారణంగా ఈ ఆటను పిల్లలు ఆటస్థలాల్లో, ఆరుబయట, విశాలమైన ప్రాంగణాల్లోనూ ఆడుతుంటారు. భారత దేశంలో ఈ ఆటను గ్రామీణ ప్రాంతాల్లో ఆడపిల్లలు ఆడతారు. అయితే నేడు నగరీకరణ, ఆంగ్ల చదువులు వల్ల ఈ ఆట క్రమేపీ అంతరించిపోతున్నది.
ఈ ఆటను ఇద్దరు ఆడవచ్చు. ముందుగా పక్కపక్కనే ఉండే నాలుగు నిలువు గళ్ళు, రెండు అడ్డగళ్ళు గల దీర్ఘ చతురస్త్రాకార గడులను గీయాలి. తరువాత గడుల బయట బాలికలు నిలుచోవాలి. ముందుగా ఒక బాలిక చేతిలో బిళ్ళను ముందు గడిలో వేసి కాలు మడిచి మిగతా ఎనిమిది గడులను దాటించి బయటకు తీసుకురావాలి. తరువాత రెండవ గడి, తరువాత 3,4,5,6,7,8, ఇలా అన్ని గడులను దాటించాలి. ఏ సమయంలో కూడా కాలు గాని, బిళ్ళగాని, గడుల గీతలను తాకరాదు. గడులన్ని అయిపోయాక కాలి వేళ్ళ మధ్య బిళ్ళను బిగించి పట్టుకుని దాన్ని కుంటి కాలితో ఎనిమిది గడులను గెంతి రావాలి.అలాగే కాలి మడం మీద పెట్టి గడులను దాటాలి. తరువాత తలపై పెట్టుకొని దాటాలి. తరువాత అర చేతిలో, ఆపై మోచేతిపై , భుజం పై, పెట్టుకొని అన్ని గడులను దాటాలి. తరువాత బిళ్ళను గడుల అవతల వేసి కళ్ళు మూసుకొని అన్ని గడులను దాటాలి. ఇవన్నీ దాటితే ఆట వారిదే అవుతుంది. మధ్యలో గీత తొక్కితే ఒకటి రెండు గడులు బాలికవి అవుతాయి. మిగతా బాలికలకు అప్పుడు ఆడటం కష్టమవుతుంది.
తొక్కుడుబిళ్ళ కోర్టులు